ఆకాశవాణి ప్రతిష్టాత్మక సాహిత్యకార్యక్రమాలలో
జాతీయకవిసమ్మేళనం ఒకటి.
ఏటా గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి25రాత్రి
10గంటలకు ఆకాశవాణి కేంద్రాలన్నింటినుండీ
ప్రసారమయ్య ఈ సర్వభాషాకవిసమ్మేళనానికి
ఒక్కొక్కభాషనుండి ప్రాతినిధ్యకవిని ఎంపికచేసి 22భాషల కవితలనూప్రసారంచేయడంజరుగుతుంది.
ఆహూతులసమక్షంలో జరిగే కవిసమ్మేళనంలో
ఎంపికచేసిన అనువాదకవులు ఆయాభాషలకవితల
హిందీకవితానువాదాలను కూడా వెనువెంటనేవినిపిస్తారు.
ఆయా ప్రాంతీయభాషాకేంద్రాలు అన్నికవితలనూ
తమతమప్రాంతీయభాషలలో
తమభాషాకవులతో చేయించిప్రసారంచేస్తాయి.
అంటే 25వతేదీ రాత్రితమిళకేంద్రాలు తమిళంలోనూ,కన్నడకేంద్రాలు
కన్నడంలోనూ,తెలుగుకేంద్రాలుతెలుగులోనూ
ఇలా22భాషాకేంద్రాలూ సర్వభాషాకవితల అనువాదకవితలను
తమతమభాషల్లో ప్రసారం చేస్తాయన్నమాట.
అయితే ఈసారి విశేషం 25 జనవరి రాత్రి ప్రసారమయ్యే
జాతీయ కవిసమ్మేళనం
ముందుగా రేపు జనవరి 9 వ తేదీ
సాయంకాలం 4 గంటలనుండి
హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఆర్.టి.సి.కళ్యాణమంటపం హాల్లోజరుగుతోంది.
ఆహూతులసమక్షంలో ఈసర్వభాషాకవిసమ్మేళనం
ఆయా భాషలకవులు,హిందీ కవితానువాద కవులుతో బాటుగా తెలుగు కవితానువాదకవులతోనూ హైదరాబాద్ లో జరుగుతోంది.
అనగా 22భాషలకవితలూ ,వాటిహిందీ , తెలుగు అనువాదాలతో
మొత్తం 66 మంది కవులూ
వేదికపైనుండి ప్రేక్షకులకు కనిపిస్తూ వినిపిస్తారు.
ఇదొక విశేషకార్యక్రమం.
ఈ కవిసమ్మేళనానికి అందరూఆహ్వానితులే!
1974లో తొలిసారి ఆకాశవాణి జాతీయకవిసమ్మేళనంలో
ఒరియాకవితను తెలుగు చేసి అనువాదకవిగాపాల్గొన్ననేను
1978లోఆకాశవాణిలోచేరాక
1983 లో తెలుగుకు ప్రాతినిధ్యకవిగా ఎంపికఅయ్యి
తెలుగుకవిగా పాల్గొన్నాను.
ఆహూతులసమక్షంలోడిల్లీకవిసమ్మేళనంలోవినిపించిన నాతెలుగుకవిత అన్నిభాషలలోకి అనువాదమై ఆ ఏడాది ప్రసారమైంది.
అకాశవాణిలో అప్పట్లో ట్రాన్‌స్ మిషన్ ఎక్సిక్యూటివ్ గా పనిచేస్తూ
దక్షిణాది నుండి ఒక స్టాఫ్ మెంబర్ కవిగాపాల్గొనడం అదేమొదటిసారి.
1991లో నేను కార్యక్రమనిర్వహణాధికారిగా పదోన్నతిచెంది
విజయవాడనుండి 1995లో హైదరాబాద్ తిరిగి వచ్చాక
తెలుగువిభాగం కార్యక్రమ నిర్వహణాదికారిగా
సుమారు దశాబ్దకాలం
జాతీయకవిసమ్మేళనం తెలుగుఅనువాదకార్యక్రమం నిర్వహించాను.
మళ్ళీ ఇన్నాళ్ళకు
ఆకాశవాణిలో పదవీవిరమణానంతరం
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో
రేపు ఆహూతులసమక్షంలో వేదికపైనుండి
బోడో భాషాకవితకు
తెలుగుఅనువాదకవిగా పాల్గొనడం
సంతోషాన్నిస్తోంది.
1983 లో నాతెలుగు కవితను హిందీచేసి వినిపించిన డాక్టర్.కున్వర్ బెచైన్ నాతోబాటుగా ఈ కవిసమ్మేళనంలో కన్నడకవితకు హిందీఅనువాదకవిగా పాల్గొంటూఊండడం ఒక విశేషం.
కవిసమ్మేళనం పూర్తివివరాల
ఆహ్వానపత్రంఇక్కడచూడండి.
మీరంతా ఈ కార్యక్రమానికి వచ్చి
జయప్రదం చేయగలరనిఆశిస్తూ.....
సదామీ
సుధామ
1 comments:
అద్భుతమైన కార్యక్రమ వివరాలు అందించినందులు ధన్యవాదాలు.
ఆకాశవాణి వారు, వారి కార్యక్రమాలను ఇంటర్నెట్ ద్వారా ప్రసారాలు చెయ్యటం మొదలుపెడితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు వినే అవకాశం ఉంటుంది. ఆపైన ఆకాశవాణి, ఆ ప్రసారాల ద్వారా అదాయమూ సమకూర్చుకోవచ్చు. ఇంటర్నెట్ ప్రసరాలాకు ఖర్చు చాలా తక్కువ అవుతుంది (షార్ట్ వేవ్ ప్రసారంతో పోలిస్తే).
Post a Comment