ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Wednesday, May 18, 2011

జోకులమ్మా.. జోకులు...


పని

‘‘అయ్యా! పిల్లలుగల వాడిని ఏదయినా పని ఇప్పించండి’’ ఓ వ్యక్తి ఓ ధనవంతుడిని బ్రతిమాలాడు.
‘‘పెళ్లయి ఏడేళ్లయిందండీ.. భార్యా ఏడుగురు పిల్లలూ.. ఏదయినా పని ఇప్పించండి’’ మళ్లీ అడిగాడు.
‘‘ఆ.. ఆ.. అది సరే నీకు ఇంకేం పనిచేయడం వచ్చో ముందది చెప్పు’’ కూల్‌గా అడిగాడా ధనవంతుడు.

రక్షణ


అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఓ అందమైన యువతిని తెగించి రక్షించాడు రాంబాబు. అతడి వంటిపై చాలా గాయాలుండడం చూసి ఆ యువతి...
‘‘ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్! అదేంటి మీ వంటిపై అన్ని దెబ్బలున్నాయ్’’అని అడిగింది.
‘‘మిమ్మల్ని రక్షించడానికి బయలుదేరిన మరో నలుగురిని చితక్కొట్టి రావాల్సి వచ్చింది మరి’’ అన్నాడు రాంబాబు.

మతిమరుపు

‘‘ఈ రోజు బస్సులో నా జేబులో పర్సు ఎవరో కొట్టేసారోయ్’’ అన్నాడు భార్యతో భర్త.
‘‘అదేమిటి? మీ జేబులో చేయి పెట్టినప్పుడు ఆ దొంగ వెధవ ఎవరో మీరు చూడలేదా?’’
‘‘అది నా చెయ్యే అనుకున్నానోయ్!’’

పరిష్కారం

బస్సులో కూర్చుని ఒకాయన బస్సులు ఆలస్యంగా రావడం గురించీ, సౌకర్యాలు లేకపోవడం గురించీ, ఏ ఆందోళన జరిగినా బస్సులు తగలెట్టడం గురించీ కండక్టర్‌తో అరగంట సేపు దుమ్మెత్తిపోసాడు.
‘‘మీరు చెప్పినవన్నీ నిజమే కానీ నేనేం చెయ్యగలను చెప్పండి. మీ ఊరి ఎమ్మెల్యేగారికి చెబితే ఏమయినా ఫలితం వుంటుంది’’ అన్నాడు కండక్టర్.
‘‘ఏడ్చినట్లే వుంది. నేనే ఆ ఎమ్మెల్యేను’’ అన్నాడాయన.

చాలు


డాక్టర్ అడిగాడు వ్యక్తిని...
‘‘మీ ఆవిడ చనిపోయినట్లు డెత్ సర్ట్ఫికెట్ రాసి ఇమ్మంటారా!’’
‘‘అక్కర్లేదండి... ఆమెకు మీరే వైద్యం చేసినట్లు రాసివ్వండి చాలు’’ అన్నాడా వ్యక్తి.

రాజీనామా

‘‘ఆశయ సాధనకోసం రాజీనామా చేయడానికి మీరు సిద్ధమా?’’ నిలదీశాడు కార్యకర్త పార్టీ నాయకుడిని.
‘‘రాజీనామాలు చేస్తూండడమే నా ఆశయ సాధన. అది తెలీదా’’ అన్నాడా నాయకుడు.

నువ్వేకదా


ఇద్దరు మిత్రులు కారులో బారుకొచ్చి బాగా తాగారు. తిరిగి కారులో బయల్దేరారు ‘‘కాస్త దూరంలో బ్రిడ్జి వుంది. అక్కడ ఎడమకి మలుపు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి గుర్తుంచుకో’’ అన్నాడు మొదటివాడు రెండో వాడిని హెచ్చరిస్తూ ‘‘్భలే వాడివే! నాకెందుకు చెబుతావ్! డ్రైవ్ చేస్తోంది నువ్వేకదా!’’ అన్నాడు రెండోవాడు.

గురి

ఓ భర్త విడాకులు కావాలని కోర్టుకెక్కాడు.
‘‘గత రెండేళ్లుగా మా ఆవిడ నామీదకు కత్తిపీట విసురుతోందండీ’’ వాపోయాడు కోర్టులో.
‘‘రెండేళ్లనుంచి విసురుతూంటే ఇప్పుడటయ్యా మరి కోర్టుకెక్కడం’’ అడిగాడు జడ్జీ.
‘‘గత రెండురోజులనుంచే గురి తప్పకుండా విసరడం అలవాటవుతోందండీ ఆమెకు’’ అంటూ కట్టుకట్టుకున్న తన చేతిని చూపించాడు.


సాధన

‘‘పెళ్లయి పాతికేళ్లయింది కదా. ఇనే్నళ్ల వివాహ జీవితంలో మీరు ఎక్కువగా ఏం సాధించారు’’ అడిగాడు జర్నలిస్టు ఉషారాణిని.
‘‘మా ఆయన్ని’’ అందావిడ కూల్‌గా.

1 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

అన్నీ బాగున్నాయి. రక్షణ, చాలు, సాధన ఇంకా బాగున్నాయి. :):):)