ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, May 1, 2011

ఆదివారం సరదాగా కాసేపు

ఇప్పటికీ

భార్య: ఆ త్రాగుబోతు అతన్ని చూసారా
భర్త: ఎవరతను
భార్య: పదేళ్ళక్రితం అతను నా బాయ్‌ఫ్రెండ్. అతన్ని పెళ్లాడడానికి నేను ఒప్పుకోలేదు.
భర్త: అవునా! దాన్ని గురించి ఇప్పటికీ రోజూ పార్టీ చేసుకుంటున్నాడన్నమాట ఆనందంగా
.

వరదానం

‘‘దేవుడా! నీకు ఒక యుగం అంటే ఎంత’’ అన్నాడు ప్రత్యక్షమైన దేవుడితో భక్తుడు.
‘‘కేవలం ఒక నిముషం’’ అన్నాడు దేవుడు.
‘‘మిలియన్ కోట్ల రూపాయలంటే నీకు ఎంత’’ అడిగాడు భక్తుడు.
‘‘ఓ రూపాయితో సమానం’’ అన్నాడు దేవుడు.
‘‘నీది ఒక్క రూపాయి నాకు ప్రసాదించు ప్రభూ!’’ అన్నాడు భక్తుడు.
‘‘తప్పకుండా! ఓ నిముషం ఆగు’’ అన్నాడు దేవుడు.

స్నేహం

‘‘స్నేహితుడికీ ప్రాణస్నేహితుడికీ తేడా ఏమిటి?’’
‘‘మనం ఆసుపత్రిలో వున్నప్పుడు ‘‘ఎలా వుందిరా’’అని వాకబు చేసేవాడు.
స్నేహితుడు. ‘‘నర్సు ఎలా వుందిరా’’ అని వాకబుచేసేవాడు ప్రాణస్నేహితుడు

శాస్తి

‘‘అదేంటి మీ ఆయన్ని ఆ సీతాలక్ష్మి లేపుకుపోతే ఊరుకున్నావేం’’ అడిగింది ఉమ శారదని.
‘‘దానికి శాస్తి జరగాల్సిందేలా! అందుకే ఊరుకున్నా’ అంది శారద.

రుచి

‘‘నాకు లత లిప్‌స్టిక్ చాలా ఇష్టం! భలే రుచిగా వుంటుంది’’ అన్నాడు రఘురాం వెంకట్రావ్‌తో.
మర్నాడు వెంకట్రావ్ రఘురాంతో ‘‘నువ్వు చెప్పింది అబద్ధం! తన దగ్గర పది లిప్‌స్టిక్‌లు తీసుకుని తిన్నాను నేను’’ అన్నాడు వాంతి చేసుకున్న ముఖంతో.

రక్షణ

‘‘మీ ఆవిడకు నీళ్లంటే భయమనీ, రక్షణ కోరుకుంటుందని నీకెలా తెలిసింది’’ అడిగాడు సుబ్బారావ్ అప్పారావ్‌ని.
‘‘నేనివాళ ఇంటికెళ్లేసరికి తను బాత్‌రూం టబ్‌లో సెక్యూరిటీ గార్డ్‌తోబాటు వుంది తెలుసా!’’ అన్నాడు అప్పారావ్.

తొలి చూపు
ఇంటి డోర్‌బెల్ మ్రోగింది. పదహారేళ్ల ఉష తలుపుతీసింది. గుమ్మం బయట కుర్రాడు.
‘‘నా పేరు నాగేశ్వర్రావ్! తొలిచూపులో ప్రేమ పట్ల నీకు విశ్వాసం వుందా! లేకపోతే నన్ను మళ్లీ రమ్మంటావా’’ అన్నాడు.


ముందే చూసుకోవాలి

‘‘నా డిక్షనరీలో ‘అసాధ్యం’ అనే పదం లేదు తెలుసా’’ అన్నాడు బూదరాజు రాధాకృష్ణ తిరుమల రామచంద్రతో
‘‘డిక్షనరీ కొనుక్కునేప్పుడే జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి మరి’’ అన్నాడు రామచంద్ర.

ఫలితం

‘‘మీకు ప్రేమించడం తెలియదు’’ అంది భార్య భర్తతో

‘‘నాకుప్రేమించడంతెలియకపోతేనే మనిద్దరుపిల్లలనూ నువ్వేమైనా ఇంటర్నెట్నుండి డౌన్‌లోడ్చేసుకున్నావా’’ అన్నాడుభర్త ఎకసెక్కంగా.

‘‘లేదు. పక్కింటాయన పెన్‌డ్రైవ్ తీసుకున్నా’’ అందామె కూల్‌గా.

ప్రశ్నలు-సమాధానాలు

ప్రశ్న: ఆ ముసలావిడ యవ్వనంలోనే ఎలా చచ్చిపోయింది
జవాబు: అరవై ఏళ్ల వయసున్నా ముప్ఫై అన్నట్లుగా చెప్పుకుంటూండేది కాబట్టి
**


ప్రశ్న: వాళ్లిద్దరి ఆలోచనలూ ఒకటేనా ఎలా?
జవాబు: ఇద్దరిదీ ‘ఐడియా’ ఒకటే మరి (సెల్‌ఫోన్)
**

ప్రశ్న: అవతలివారు ఎలాంటి ఆసక్తి చూపించకపోయినా మాట్లాడుకుంటూ పోయేవారిని ఏమనచ్చు.
జవాబు: లెక్చరర్
**

ప్రశ్న: బ్లాక్ కాఫీ తెమ్మంటారా?
జవాబు: ఇంకా వేరే రంగులేమున్నాయి
**

ప్రశ్న: గోతిలో పడిన గాడిదను పైకి లేపి నేను రక్షించాననుకో. దానే్నమనుకోవచ్చు
జవాబు: సోదర ప్రేమ.
**

ప్రశ్న: మీ నాన్నగారు అంతముసలివారా ఎలా?
జవాబు: ఇప్పుడు మనం చరిత్రగా చదువుకుంటున్నవి ఆయన స్కూలు రోజుల్లో వార్తల్లోని ముఖ్యాంశాలుగా టీవీలో వచ్చేవిట.
 
 
 
 
 
 
**

1 comments:

CH.K.V.Prasad said...

బాగున్నై!