ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, April 23, 2011

సరదా సరదా గా ...
చోటు
జడ్జి: అతను మిమ్మల్నెక్కడ ముద్దుపెట్టుకున్నాడు.
ఆమె: నా పెదవుల మీదండీ!
జడ్జి: ఉహూ! మీరు సరిగ్గా అర్థంచేసుకోవడంలేదు. నా ఉద్దేశం అతను మిమ్మల్ని ముద్దుపెట్టుకున్నప్పుడు మీరెక్కడ వున్నారు?
ఆమె: అతని కౌగిట్లో!
***
పోలిక
ఆఫీసర్‌గారి భార్య మగ శిశువుకి జన్మనిచ్చింది. ఆయన తెగ సంబరపడిపోయాడు. ఆఫీస్ స్ట్ఫాంతా నర్సింగ్ హోంకి వచ్చి స్తోత్రం ఎత్తుకున్నారు. అరగంట ఆలస్యంగా ఆఫీసుకొచ్చినా అగ్గిమీద గుగ్గిలం అయ్యే ఆఫీసర్‌ని ప్రసన్నంచేసుకునే తరుణమిదేనని రెచ్చిపోయారు.
‘‘ఆహా ఏ రంగు’’
‘‘ఆహా ఏం వర్చస్సు’’ అంటూ పిల్లాడిని పొగడ్తలతో ముంచేసారు. పోలిక పట్టుకోలేని స్టేజిలో కూడా పొగడ్తలు సాగాయి.
‘‘కుర్రాడు అచ్చు మీ పోలికే సార్’’ అన్నాడొకతను.
‘‘నిజమే సార్! ఆ కళ్ళు అచ్చం మీకళ్ళే’’ మరొకాయన.
‘‘నుదురు అచ్చుగుద్దినట్టు మీరేనండీ’’ అంది ఒకామె.
‘‘బుగ్గలు, మెడ, చేతులు మీరే సార్’’ ఒకతను.
‘‘అరె! ఆ గోళ్లు కూడా అచ్చం మీవేసార్’’ అన్నాడింకొకాయన.
చివరగా ఆయన సెక్రటరీ-
‘‘ఆశ్చర్యం సార్! ఆ బొడ్డు, నడుము, తొడలు అంతా మీ పోలికే సార్!’’ అనేసింది.
***
లాభం
‘‘నువ్వు తేనెటీగలను పెంచావుకదా? ఏమైనా లాభం వచ్చిందా?’’
‘‘బ్రహ్మాండంగా! ఇప్పుడు చుట్టపక్కాల బెడద పూర్తిగా తప్పిపోయింది’’
.
***
తదనంతరం
‘‘కవిగారూ మీ పుస్తకమేదో పబ్లిష్ అవుతుందన్నారు. ఎప్పటికి బైటకు వస్తుంది’’ అడిగాడో మిత్రుడు.
కవిగారు విషాద కంఠంతో ‘‘ఏం చెప్పమంటారు. కొన్నాళ్ల క్రితం ఆ పబ్లిషర్ తండ్రి చనిపోయాడు. మరి కొద్దిరోజుల్లోనే అతని భార్య పోయింది. ఇప్పుడిప్పుడే వాళ్ల అన్న చనిపోయినట్లు కబురొచ్చింది’’ అన్నాడు.
‘‘పోనీలెండి పబ్లిషర్ బావున్నాడు కదా!’’ అన్నాడు మిత్రుడు.
‘‘ఏమోనండీ నా పుస్తకం అచ్చయ్యేవరకన్నా ఉంటాడో లేడో’’ అన్నారు.
కవిగారు విషాదంతో. అంతా విన్న మిత్రుడు అన్నాడు కదా-
‘‘పుస్తకం అచ్చయ్యేవరకూ ఉంటాడు లెండి. ఆ తరువాత పాఠకులు బతకనిస్తారని నమ్మకంగా చెప్పలేం.’’
***
సలహా
‘‘డాక్టర్‌గారు మార్నింగ్‌వాక్ చెయ్యమని సలహా ఇచ్చారు. పెంపుడు జంతువు లేనిదే నేను బయటకు వెళ్లడం అలవాటు లేదు. మా కుక్కను తీసికెడితే ఒకటే పరుగులు పెట్టిస్తోంది. సాఫీగా నడక సాగించడం ఎలాగూ తెలీడం లేదు’’ అన్నాడు మూర్తి నాగేశ్వర్రావ్‌తో.
‘‘ఓ నత్తను పెంచుకో’’ అన్నాడు నాగేశ్వర్రావ్.
***
కారణం
‘‘రైల్వేమంత్రి అయ్యుండీ మీరీ సభకు విమానంలో వచ్చారంటే రైలు ప్రమాదాలకి భయపడే కదూ!’’ అన్నాడు మంత్రిగారితో సాటి మిత్రుడు.
‘‘నేను రైల్లో రాకపోవటానికి రైలు ప్రమాదాలకి భయపడి కాదు. ఈ సభకు ఆలస్యంగా వచ్చి మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టంలేక’’ అన్నారు మంత్రిగారు.
***
ఛాన్స్
‘‘ఏమిటో డాట్రారూ! నాలుక ఇలా బయటకొచ్చేస్తోంది. ఓ పది నిముషాలయితే గానీ లోపలకు పోవడంలేదు’’ అన్నాడు డాక్టర్ దగ్గరకు చూపించుకోవడానికి వచ్చిన ఓ రోగి.
‘‘అమ్మాయ్యా బ్రతికించారు! ఇదుగో నర్సూ! మా అమ్మాయి పెళ్లి శుభలేఖలకు కవర్లూ, స్టాంపులూ అక్కడ పెట్టాను. త్వరగా ఇలా పట్రా!’ అన్నాడు డాక్టర్ సంబరంగా.
***
పత్రిక బాగా అమ్ముడుపోవాలంటే
కవరుమీద
అమ్మాయి వుండాలి..

అమ్మాయి మీద
ఏ కవరూ ఉండకూడదు
అంతే!


0 comments: