ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, April 21, 2011

పూతరేకులు.6




డిగ్రీ

‘‘కంగ్రాట్స్! మొన్నటిదాకా నీ నేమ్‌ప్లేట్ బి.ఏ. అని వుండేది. ఇప్పుడు ఎం.ఏ. అని వుంది. అంత త్వరగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఎలా చేసేసావ్’’ అడిగింది లలిత పార్వతీశాన్ని.
‘‘అబ్బే! నా భార్యపోయిన కొత్త కాబట్టి (బాచిలర్ ఎగైన్ అని) బి.ఏ. అని రాసుకున్నాను. ఇప్పుడు మళ్లీ పెళ్లిచేసుకున్నా కాబట్టి ఎం.ఏ. (అంటే మేరీడ్ ఎగైన్) అని రాసుకున్నాను’’ అన్నాడు పార్వతీశం.

ఆదర్శం

‘‘శివుడిని ఆదర్శంగా తీసుకుని ఇద్దరమ్మాయిలను పెళ్లాడుదామనుకుంటున్నా. నీకు పార్వతిగా వుండటం ఇష్టమా? గంగగా వుండటం ఇష్టమా? ఎలా వుండటం ఇష్టం చెప్పు డియర్ అడిగాడు కపర్ది దేవిని. ద్రౌపదిగా? టక్కున బదులిచ్చింది దేవి.

గుర్తు

‘‘రిటైరయ్యాక ఆదివారాలకూ సెలవులకూ, మామూలు రోజులుకూ నాకు తేడా లేకుండా వుందనుకో’’ అన్నాడు చక్రవర్తి సతీష్‌తో.
‘‘నేనూ రిటైరయినా నాకా తేడా బాగా గుర్తుంటోంది’’ అన్నాడు సతీష్.
‘‘నీకు జ్ఞాపకశక్తి ఎక్కువనుకుంటా’’ అన్నాడు చక్రవర్తి.
‘‘అబ్బే! అదేం లేదు. ఆదివారాలు సెలవురోజుల్లో అయితే బెడ్‌షీట్స్ సోఫా కవర్లు, దుప్పట్లు, కర్టెన్లు ఉతికి ఆరవేయిస్తుంది నాచేత మా ఆవిడ. మామూలు రోజుల్లో మామూలు బట్టలే ఉతుకుతా’’ అన్నాడు సతీష్
.

బెదిరింపు


పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడువెంగళప్ప
‘‘సార్! నాకు రోజూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్’’ అని ఫిర్యాదుచేశాడు.
పోలీస్ ‘‘ఏమని వస్తున్నాయి’’ అని అడిగాడు.
‘‘్ఫలానా తేదీలోగా రీఛార్జ్ చేయించకపోతే నీ కనెక్షన్ కట్ చేస్తామంటున్నారు సార్!’’ అన్నాడు వెంగళప్ప
.

తెరిచి లేవు

‘‘ఏరా స్వామీ! నిన్ను ఉత్తరం పోస్ట్‌చేయమని ప్రొద్దున్న అనగా చెప్పాను. బయట బలాదూర్ తిరిగొచ్చావుగానీ ఆ ఉత్తరం పోస్ట్ చెయ్యలేదేం!’’ గదమాయించాడు వెంకటేశ్వర్రావ్.
‘‘సార్! నేను సిటీ అంతా తిరిగాను సార్! ఒక్క పోస్టు డబ్బా కూడా తెరిచి లేదు. అన్ని ఉత్తరాల డబ్బాలూ తాళంవేసి వున్నాయి. ఎలా పోస్టు చేసేది’’ అన్నాడు స్వామి.


పులి

‘‘క్లాసులో అందరూ కరెక్ట్ టైంకి వస్తే నువ్వొక్కడివే ఆలస్యంగా వచ్చావేమిటోయ్!’’ గద్దించాడు మాస్టారు అప్పూగాడిని.
‘‘గొర్రెలెప్పుడూ మందగా వస్తాయి. పులి మాత్రం ఒక్కటే వస్తుంది సార్!’’ కాలరెగరేస్తూ అన్నాడు సినిమా పిచ్చిగల అప్పూ.


గొప్ప

‘‘రోజూ యాభై మందికి తక్కువ కాకుండా మా అన్నయ్య అన్నం వడ్డిస్తున్నాడంటే నిజంగా గొప్పే.
తను సంఘసేవకుడా అడిగింది లావణ్య ప్రియాంకను.
'కాదు హోటల్లో బేరర్' అంది ప్రియాంక.


కొత్త ఐటం

‘‘ఎప్పుడూ అదే చికెన్ ఫ్రై, చికెన్ సిక్స్‌టీ ఫైవ్, తండూరీ చికెన్ అని వల్లిస్తూంటావ్! కొత్త నాన్‌వెజ్ ఐటమ్ ఏమీ లేదేంటోయ్’’ అడిగాడు బాబూరావ్ హోటల్ సర్వర్‌ని చికాగ్గా చూస్తూ.
నాన్‌వెజ్ లిస్ట్ అంతా చదివినా అలా అడిగిన బాబూరావ్ కేసి చూసి ఓపిక నశించిన సర్వర్ ‘‘చికెన్ గునియా వుంది’’ అన్నాడు.


మార్పు

‘‘నీ సంపాదనంతా తాగుడుకే తగలేస్తున్నావ్’’ అని మా ఆవిడ తిట్టాక ఇవాల్టినుంచీ మారాలని డిసైడ్ అయ్యానోయ్’’ అన్నాడు పాత్రో కృష్ణమాచారితో.
‘‘వెరీగుడ్! ఏంచేయదలుచుకున్నావ్’’ అడిగాడు చారి.
‘‘ఇవాల్టినుంచి కొంత పేకాటలో కూడా పెట్టదలుచుకున్నాను’’ అన్నాడు పాత్రో.


దేవుడికి

‘‘ఎందుకు అమ్మమ్మా! నువ్వు వంగి నడుస్తావెందుకు?’’ అడిగాడు మనుమడు.
‘‘దేవుడు పైకి లాక్కుంటాడేమోనని’’ అంది అమ్మమ్మ.



****

నీకోసం నాలుగు పువ్వులు
ఒకటి స్నేహానికి
రెండోది శుభానికి
మూడోది సంతోషానికి
నాలుగోది ఎందుకంటావా?
చెవిలో పెడతా! బాగుంటుంది.




0 comments: