ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 1, 2016

శ్రీమతి శారదా శ్రీనివాసన్ : చిరంజీవి సాహిత్య సమాలోచనం


రేడియో నాటకం అనగానే 

శ్రీమతి .శారదా శ్రీనివాసన్ గారే గుర్తొస్తారు. 

చలం గారి ' పురూరవ ' కు జీవం పోసి స్వయానా ఆయన ప్రశంసలకు 

పాత్రమైన ఖ్యాతి ఆవిడది.

ఆకాశవాణి లో వారితో కలసి పనిచేయడం ,వారి పక్కన 

రేడియో నాటకంలో నటించడం ఓ అదృష్టం .శ్రీమతి శారదాశ్రీనివాసన్ గారు 

గురువుగా భావించే వ్యక్తి రేడియో నాటక విభాగంలోనే 

పనిచేసిన కె.చిరంజీవి గారు.


రేడియో నాటకానికి విశేష గౌరవం కలిగించీన ఆయన 

గొప్ప అభ్యుదయ నవలా,నాటక రచయిత .

"జైబోలో స్వతంత్ర భారత్ కీ జై "

అనే నవల వారి రచనల్లో విశిష్ఠమైనది.


పలు నవలలు ,రంగస్థల ,రేడియో నాటకాలు రచించిన

కె.చిరంజీవి గారి సాహిత్య సమాలోచనాన్ని 

ఒక గ్రంథంగా రాసీన ఘనత శ్రీమతి శారద గారికే దక్కుతుంది. 

అయితే తనపై సహోద్యోగి రాసిన ఆగ్రంథం అచ్చులో 

చూసుకోకుండానే ఆయన గత సంవత్సరమే కన్నుమూసారు.

అయితే శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు 

రాసి వినిపించింది అంతా ,సుధామ ముందుమాటతో సహా

విని సంతోషించారు .


చిరంజీవి సాహిత్య సమాలోచనం 

గ్రంథానికి 

శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు కోరగా

" సమాజ శ్రేయోభిలాషి '" పేరిట రాసిన ముందుమాట ఇది 0 comments: