నిజానికి వ్యక్తికన్న వ్యవస్థ గొప్పది. కానీ వ్యవస్థ అవస్థల పాలవకుండా, ఒక కాపుకాచే నాయకత్వ పటిమ ఒక సమయంలో అనివార్యవౌతుంది. వ్యవస్థలో లోపాలను సవరించబూనే వ్యక్తిలో లోపాలు వుండవని కాదు. కానీ వాటిని విస్మరించి సమాదరించగల నేర్పును, చేవను, ఆచరణాత్మక ఫలితాలను ఆ వ్యక్తి చూపగలిగినప్పుడు సమాజం హర్షిస్తుంది.
మన నూతన ప్రధాని నరేంద్రమోడి ఒక డైనమోగా డా.వడ్డి విజయసారథి సంపాదకత్వంలో వెలువడిన నవయుగ భారతివారి వ్యాస సంకలనంలో మూడుపదులకు పైగా వున్న రచనలు నూటపాతిక సంవత్సరాలపైని చరిత్రగల కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా మొన్నటి ఎన్నికల్లో ఓడించి గెలిచిన మోడీ ప్రభంజనం గురించి ఎన్నికల ముందునుండి విజయందాకా వెలువడిన పలువురి రచనల సమాహారం.
తుహిన్ ఎ.సిన్హా, కంచన్‌గుప్త, శంకర్ అయ్యర్, చేతన్‌భగత్, తలీన్‌సింగ్, వీరేంద్రపారేఖ్ వంటి వారి రచనలతోబాటు ఎ.సీతారామారావు, డా.బి.రాఘవేంద్రస్వామి, టి.హనుమత్‌ప్రసాద్, వైనతీయ వంటి వారి వ్యాసాలు జాగృతి పత్రికా సంపాదకీయాలు ఇందులో సంకలనం చేశారు.
దేశమంతా ఆలోచించిన తీరుకు, ప్రాంతీయ పార్టీలకు పట్టంకట్టి ఇక్కడ తెలుగువారు ఆలోచించిన తీరుకూ బోలెడు వ్యత్యాసం వుంది. నరేంద్రమోడీ నాయకత్వంలో భా.జ.పా. ఇచ్చిన పిలుపులోని సామంజస్యాన్ని తెలుగువారు ఎందుకు సమర్ధించలేకపోయారన్నది మిలియన్ డాలర్ల ప్రశే్న! ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అన్న మాటను సమర్ధిస్తూ ఒక సంవత్సర కాలంలో దేశంలో సంభవించిన పరిణామాలకు ఈ జాగృతి పత్రికా వ్యాసాలు ఒక ఆలోచనాత్మక నమోదు.
- -సుధామ
మన నూతన ప్రధాని న.మో. ఒక డైనమో-
సంపాదకుడు: డా.వడ్డి విజయసారథి
వెల: 70 రూ/-
నవయుగ భారతి ప్రచురణ-
3-4-852, కేశవ నిలయం,
బర్కత్‌పుర, హైద్రాబాద్-27
సంపాదకుడు: డా.వడ్డి విజయసారథి
వెల: 70 రూ/-
నవయుగ భారతి ప్రచురణ-
3-4-852, కేశవ నిలయం,
బర్కత్‌పుర, హైద్రాబాద్-27
Andhrabhoomi (Daily) -Akshara- 25.10.2014
2 comments:
Greatly brought the real Truth in an accurate language. Thanks for the language of you which can be smelled and tasted with the Best Aroma of our Dearest Language Telugu ! May you Inspire many...
Thank you for your kind regards Sri Sudhakar Adepu garu.
Post a Comment