ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, December 20, 2013

శత జయంతి పజిల్



--------------------------------- ఆర్థర్ విన్నీ----------------------------------


‘‘సుడోకు’కన్నా నాకు ‘క్రాస్‌వర్డ్ పజిల్స్’అయిన ‘గళ్ళ నుడికట్టు’లే ఇష్టం! అందువల్ల పద సంపద తెలుస్తుంది. భాష అభివృద్ధి అవుతుంది. ఇచ్చిన ఆధారాలతో- అడ్డం, నిలువు గడులలో ఆ పదాలను కనుక్కుని నింపడం, నిజంగా ‘మెదడుకు మేత’ కూడాను. బుర్రను చురుగ్గా ఉంచడానికి వీలవుతుంది. రకరకాల పత్రికల్లో వచ్చే గళ్ళ నుడికట్టులు నింపడానికి నేను ఇంట్లో అవసరార్థం నిఘంటువులను కూడా సమకూర్చుకున్నాను. పైగా కొన్ని పత్రికలు సరియైన సమాధానాలు రాసిన వారి పేర్లు ప్రచురించడమే కాకుండా, నగదు బహుమతులు ఇస్తున్నవి కూడా ‘‘వున్నాయ్!’’ అన్నాడు రాంబా బు పెన్నూ, పత్రికా మూసి టేబుల్ మీద పెడుతూ.

‘‘నువ్వన్నది నిజం రాంబాబూ! ‘క్రాస్‌వర్డ్ పజిల్స్’ నింపడం వల్ల మన ‘పద సంపద’ పెరుగుతుంది. భావ వినిమయానికి చక్కని భాష జమకూడుతుంది. గడులు నింపడానికి ఇచ్చే ఆధారాలు, ఆ ఆధారాలతో వచ్చే పదంలో నింపే అక్షరాలు ఎన్ని వుంటాయన్న సూచనా, ఆ పదం కనుక్కునేటందుకు ఆలోచనలను ఉరకలెత్తిస్తుంది. అందునా- నాకు ఆధారాలు భలే ఇష్టం! ఒకే పదం అయినా, రకరకాల ఆధారాలు సంతరిస్తూండడంవలన ఉత్సాహంగా వుంటుంది. శ్రీశ్రీగారు ఒకసారి- ‘‘పిల్లి లేని పినతల్లి వికారంతో కూడితే గరుత్మంతుడి తల్లి’’అని ఇచ్చిన ఆధారం నాకు భలే గుర్తుండిపోయింది. ‘వినత’ అన్న పదం కోసం ఆయన చమత్కారంగా ఇచ్చిన ఆధారం అది. అసలు ఈ ‘పదబంధ ప్రహేళికలు’ కూర్చేవారి ప్రతిభ- ఆధారాలు కూర్చడంలోనే వుంటుందనిపిస్తుంది నాకు. దినపత్రికల్లో, వారపత్రికల్లో, మాస పత్రికల్లో అనేక పత్రికల్లో- ఏడు, తొమ్మిది, పనె్నండు అంతకన్నా ఎక్కువ అడ్డం, నిలువు గళ్ళతో కూర్చబడే ఈ పదబంధ ప్రహేళికలకు పాఠక జనాదరణ కూడా బాగా వుందనిపిస్తోంది. అసలు ఏ ముహూర్తంలో ఎవరు ఇది కనుక్కున్నారో గానీ, భలే వుంటుందిలే!’’ అన్నాడు ప్రసాదు.


‘‘అదే ఆ విషయమే చెబుదామనుకుంటున్నానర్రా! ఈ ‘క్రాస్‌వర్డ్ పజిల్’అనేది పుట్టి, సరిగ్గా రేపు డిసెంబర్ 21కు వందేళ్ళు అవుతోంది. రేపే ‘క్రాస్‌వర్డ్ పజిల్ శత జయంతి’ అన్నమాట!’’ అన్నాడు సుందరయ్య నవ్వుతూ.


‘‘అవునా!’’ అని రాంబాబూ, ప్రసాదూ ఒకేసారి ఆశ్చర్యం ప్రకటించారు.


‘‘అవును! 1913 సంవత్సరం డిసెంబర్ 21న ఆదివారం ‘న్యూయార్క్ వరల్డ్’అనే- న్యూయార్క్ న్యూస్ పత్రికలో తొలిసారిగా ఈ ఇంగ్లీష్‌లో క్రాస్‌వర్డ్ పజిల్ ఆవిర్భవించింది. దీని సృష్టికర్త ‘ఆర్థర్ విన్నీ’. 1871 జూన్ 22న ఇంగ్లాండ్ లివర్‌పూల్ గ్రామంలో జన్మించిన ఆర్థర్ విన్నీ (ARTHUR WYNNE) తన పందొమ్మిదవ ఏట యునైటెడ్ స్టేట్స్‌కు తరలి వెళ్ళి, మొదట్లో పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియాలో నివసిస్తూ, పిట్స్‌బర్గ్ ప్రెస్ న్యూస్ పేపర్లో పనిచేశాడు. అతను ‘సింఫొనీ ఆర్కెస్ట్రా’లో అప్పట్లో వయొలిన్ వాయించేవాడు కూడా! తరువాత న్యూజెర్సీకి వెళ్ళి వుంటూ- న్యూయార్క్ సిటీకి చెందిన వార్తాపత్రిక ‘న్యూయార్క్ వరల్డ్’లో చేరాడు. ఆదివారం సంచికకు పాఠకుల వినోదానికి ఏదైనా ‘గేమ్’లాంటిది తయారుచేయమని ఆ పత్రికా సంపాదకుడు అడిగినప్పుడు, విన్నీ- ఈ ‘క్రాస్‌వర్డ్ పజిల్’ను సృష్టించాడు. డైమెండ్ ఆకారంలో మొదట్లో ‘వర్డ్‌క్రాస్’ పేరుతో మొదలైన ఈ పజిల్‌కు ‘క్రాస్‌వర్డ్ పజిల్’ అని తరువాత పేరుపడింది. లాటిన్‌లో ‘పోంపీ’అనే ఒక ప్రాచీన పద క్రీడలో కొన్ని పదాలు ఇవ్వగా, వాటిని గడులలో సరిగ్గా అమర్చడం, అడ్డంగా నిలువుగా వాటిని పేర్చడం అనేది చేసేవారట. ‘మేజిక్ స్క్వేర్’గా అది ఆంగ్లంలోకి వచ్చింది. విన్నీ క్రాస్‌వర్డ్ పజిల్‌లో పదాలు ఇవ్వడం కాకుండా, పదాలు కనుగొనే ఆధారాలు ఇవ్వడం అనేది ప్రవేశపెట్టి, ఒక కొత్త తరహాని నిర్మించారు. అలా ‘క్రాస్‌వర్డ్ పజిల్’ని ‘ఆర్థర్ విన్నీ’ రాన్రాను పటిష్టపరిచాడు. మొదట్లో ‘డైమండ్’ ఆకారంలోని పజిల్, ఆ తరువాత ‘లంబం’గా, ‘నలుచదరం’గా రూపొందించాడు. క్రాస్‌వర్డ్ పజిల్స్‌లో ఖాళీ నలుపు గడులను ప్రవేశపెట్టాడు. అలా 1913 డిసెంబర్ 21న ఆవిర్భవించిన ఈ పజిల్ 1922లో బ్రిటిష్ పబ్లికేషన్ ‘పియర్సన్’ మ్యాగజైన్‌కు ఎగబ్రాకింది. 1930 ఫిబ్రవరి 1న ‘న్యూయా ర్క్ టైమ్స్’లో క్రాస్‌వర్డ్ పజిల్ ప్రారంభమైంది. 1924లోనే అమెరికాలో క్రాస్‌వర్డ్ పజిల్స్‌ల సంకలన గ్రంథం అచ్చయిందిట’’అన్నాడు సుందరయ్య.


‘‘మన తెలుగు ‘ఆనందవాణి’ పత్రికలో క్రాస్‌వర్డ్ పజిల్ అనే గళ్ళనుడికట్టు మొదలైందనీ, అయితే శ్రీశ్రీయే దానికి ఆ పేరు పెట్టి- విస్తృత ప్రాచుర్యంలోకి తెచ్చాడనీ, ‘జ్యోతి’ మాస పత్రికలో శ్రీశ్రీ అనంతరం, ఆరుద్ర పదబంధ ప్రహేళికలు నిర్వహించాడనీ తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో వివిధ దినపత్రికల ఆదివారం అనుబంధాల్లో, రోజువారీ పుటల్లో అలాగే, వార, పక్ష, మాస పత్రికల్లో నేటికీ ఇవి అద్భుతంగా కొనసాగుతున్నాయి. పెద్ద్భిట్ల సుబ్బరామయ్య, సుధామ, విహారి, నిశాపతి, డా.ఎన్. సురేంద్ర, గొరుసు, కైపు ఆదిశేషారెడ్డి, జె.వి.వి. ప్రసాదరావు, హుమయూన్ సంఘీర్, సి.హెచ్.వి.బృందావనరావు వంటి వారెందరెందరో తెలుగులో క్రాస్‌వర్డ్ పజిల్స్ నిర్మించి నేడు పాఠకులను అలరిస్తున్నారు. ఈ పజిల్ శత జయంతి ఆనందదాయకం. ఆహ్లాదకారకం’’ అంటూ సుందరయ్యతో కరచాలనం చేశాడు రాంబాబు.




--------------------------------------------------------------------------------
The Newyork world
100 Years Of Solvitude: A Reported Crossword Puzzle published on 21.12.1913
Crossword puzzle
To quote the original instructions: "Fill in the small squares with words which agree with the following definitions." (A link to this puzzle's solution is below.)
2-3. Peg O' My Heart and You Made Me Love You. Popular in 1913.
4-5. Opening line of Say It Loud: I'm Black and I'm Proud: "Uh, with your _ _."
6-7. What certain letters form.
10-11. What you might find in a car's boot.
14-15. One.
18-19. Reverse.
22-23. Centuries and centuries.
26-27. Teddy Roosevelt battled this disease in 1913.
28-29. "_ _ is an island — John Donne.
30-31. The tool of confident crossworders.
8-9. Baby powder.
12-13. True that.
16-17. A _ With a View by E.M. Forster.
20-21. Star of 1913 silent movie The Battle of Elderbush Gulch.
24-25. Crosswords became one of these in the 1920s.
10-18. 19th letter of Greek alphabet.
6-22. First crossword creator Arthur _.
4-26. What drives some crossworders.
2-11. A vetch.
19-28. Second son of Judah in Bible.
F-7. Wabbit hunter Elmer _.
23-30. Feed the pig.
1-32. Highest forms of humor, to some of us.
33-34. The end of a prayer.
N-8. Brit acronym for: Not in Education, Employment or Training.
24-31. Kukla and Ollie's friend.
3-12. Cole _.
20-29. No pain; no _.
5-27. Where Arthur Wynne died in 1945.
9-25. _ word puzzle.
13-21. The fibre of the gomuti palm and what Homer Simpson might say about this puzzle.


0 comments: