ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, June 26, 2011

నవ్వాలండోయ్...నవ్వాలి!!

ముఖ్య గుణం

అయిదు ముఖ్య గుణాలు అమ్మాయిలో వుండాల్సినవిగా కళాకృష్ణ చెప్పినవి.
1. ఇంటి పనుల్లో సహకరించేది, వేళకు కమ్మగా వండి పెట్టేది, అంట్లు తోమేది ఉద్యోగం చేసేది అయ్యుండడం ముఖ్యం. 2. నినె్నప్పుడూ నవ్వించే అమ్మాయి అయ్యుండాలి.
3. నువ్వు విశ్వసించగలిగేది, నీతో అబద్ధం ఆడనిది అయిన అమ్మాయి కావాలి.
4. శయ్యాసుఖాన్ని ఇచ్చి నీతో వుండగోరేది కావాలి.
5. మరీ ముఖ్యంగా ఈ నలుగురు అమ్మాయిలూ ఒకరినొకరు ఎరిగినవారై వుండకుండా వుండడం ముఖ్యం.

ఎందుకు మరి

అమ్మతోబాటు డాక్టర్‌గారి క్లినిక్‌కు వెళ్లిన మూడేళ్ల సుమిర అక్కడ కడుపుతో వున్న ఒకావిడను చూసి. ‘‘నీకెందుకంత పొట్ట వుంది’’ అంది.
‘‘కడుపులో ఛోటా బేబీ వుందిగా’’ అని ఆవిడ సమాధానం ఇచ్చింది.
సుమిర కళ్లు పెద్దవి చేస్తూ ‘‘నిజంగా పొట్టలో పాపాయి వుందా’’ అంది.
‘‘అవును’’.
‘‘అది మంచి పాపాయేనా’’.
‘‘ఔను! నిజంగా మంచి పాపాయే.’’
‘‘మరయితే పాపం! ఎందుకు మింగేసావ్’’ అడిగింది సుమిర.

అడవి

ఒక మనిషి అడవిలో ఎంత దూరం నడవగలడు
సగమే! ఆ తరువాత అడవి బయటపడడానికి తరమబడతాడు

వాడకం
అంతరిక్ష యాత్రికులను పంపడం మొదలెట్టినప్పుడు నాసావారు జీరో గ్రావిటిలో బాల్‌పాయింట్ పెన్ను పనిచేయడం లేదని గ్రహించి ఆ సమస్యను అధిగమించడానికి నాసా సైంటిస్టులు పదేళ్లు కష్టపడి పనె్నండు మిలియన్ల రూపాయలు వెచ్చించి జీరోగ్రావిటీలో, తలక్రిందుగా నీటిలోనూ, అద్దంతో సహా దేనిమీదయినా 300 డిగ్రీల సెంటిగ్రేడ్ క్రింద కూడా రాయగల పెన్నును కనిపెట్టడానికి కృషిచేసారు. రష్యన్లు పెన్సిల్‌ను వాడారు.

పాస్‌వర్డ్

సుందర రామకృష్ణ కంప్యూటర్ పాస్‌వర్డ్‌గా- ‘‘కృష్ణ కర్ణ భీమ దుర్యోధన అర్జున బిళ్వమంగళ మురారి కవి’’ అని పెట్టుకోవడం తెలిసినవాళ్లావిడ ‘‘ఎందుకంత పొడుగు పాస్‌వర్డ్’’ అని అడిగింది.
‘‘పాస్‌వర్డ్ మినిమమ్ 8 క్యారక్టర్స్ వుండాలిట మరి’’ అని సుందర రామకృష్ణ సమాధానం.

వెతకలేను

పాతికేళ్ల వివాహ వార్షికోత్సవం అయ్యాక వెంకట్రావ్ భార్యతో ప్రేమగా ‘‘నిన్ను చూస్తూ మళ్లీ మనసు పారేసుకున్నానోయ్’’ అన్నాడు.
పరధ్యాన్నంగా వున్న ఆవిడ ‘‘అలా పారేసుకుంటూంటే నేను వెతికి పెట్టలేను బాబూ’’ అంది, అంతక్రితమే ఆయన కళ్లజోడు వెతికి ఇచ్చిన విషయం గుర్తుచేసుకుంటూ.

మార్పు

‘‘గ్రీన్ లైట్‌తో రెడ్‌లైట్ ఏమంటోంది పోలీసూ!’’ అడిగాడు ఓ కుర్రాడు ట్రాఫిక్ పోలీసును.
‘‘అలా చూడకు. నేను మారుతున్నాను అంది’’ అన్నాడు పోలీసు.


ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న: సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ వున్నాయి
జవాబు: పనె్నండు (జనవరి సెకండ్, ఫిబ్రవరి సెకండ్, మార్చి సెకండ్ అలా...)

* * *

ప్రశ్న: పొడిగా వున్నకొద్దీ తడితడి చేయగలదేమిటి
జవాబు: తువ్వాలు

* * *

ప్రశ్న: వెనక్కి తిరిగి రాని బూమెరాంగ్‌ని ఏమంటారు
జవాబు: వట్టి కర్రముక్క

* * *
ప్రశ్న: స్నోమేన్‌కు స్నో ఉమెన్‌కు తేడా ఏమిటి?
జవాబు: స్నో బాల్స్!

* * *

ప్రశ్న: విడాకులు అంటే
జవాబు: దేన్ని గురించి దెబ్బలాడుకోవాలో ఏకాభిప్రాయం కుదరని జంట చర్య

* * *

ప్రశ్న: ‘ఆన్ ది అదర్ హ్యండ్’ అన్నదాన్ని ఎలా అర్థంచేసుకోవాలి
జవాబు: ఇంకో అయిదు వేళ్లున్నాయని.

***

1 comments:

Anonymous said...

కొత్తగా వున్నాయి. అన్నీ బాగా నవ్వించాయి. థాంక్స్